A News Based Website Discover the World Through Us.

Get In Touch

లిక్కర్ కేసులో ఎనిమిదోసారి ఈడీ సమన్లు

మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ 8వ సారి సమన్లు జారీ చేసింది. గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేయగా వివిధ కారణాలతో విచారణకు హాజరుకాలేదు.

తాజాగా ఇవాళ(మంగళవారం) మరోసారి నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాఫ్తు సంస్థ.. మార్చి 4న విచారణకు హాజరు కావాలని తెలిపింది.

కేజ్రీవాల్ వరుసగా విచారణకు గైర్హాజరవుతుండటంతో దర్యాఫ్తు సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తనను కోర్టు ఆదేశిస్తేనే విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ నిన్న తేల్చి చెప్పారు.

తమను ఇండియా కూటమి నుంచి నిష్క్రమింప చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమపై విచారణ పేరుతో ఒత్తిడి చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంది.

భ్రమయుగం- రివ్యూ {3/5}

72 ఏళ్ల వయస్సులో కమర్షియల్ పాత్రల్లో ఇంకా సాధించేదేమీ లేని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఈ మధ్య వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న సరళి కన్పిస్తోంది.

సైకలాజికల్ థ్రిల్లర్ ‘రోర్చాచ్’, విజిలాంటీ థ్రిల్లర్ ‘క్రిస్టఫర్’, పోలీస్ థ్రిల్లర్ ‘కన్నూర్ స్క్వాడ్’, హోమోసెక్సువల్ డ్రామా ‘కాథల్ : ది కోర్’, ఇప్పుడు పీరియడ్ హార్రర్ ‘భ్రమయుగం’ ( ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్). ఇది ఆధునిక ప్రయోగాత్మక సినిమాల్లో దేశంలోనే మొదటిది.

ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతరించిపోయిన దశాబ్దాల తర్వాత, బ్లాక్ వైట్ లో తీయడం ప్రయోగాత్మకమే కాదు, సాహసం కూడా. ఈ వయసులో మమ్ముట్టి చేయాల్సింది ఇలాటివే.

img

దీనికి అసాధారణ సినిమా నిర్మాణ శైలికి, సంక్లిష్ట కథనాలకి పేరుతెచ్చుకున్న యువ దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రాణం పోయడమొక అదనపు హంగు. ‘రెడ్ రెయిన్’, ‘భూతకాలం’ వంటి విభిన్న హార్రర్లు తీసిన ఇతను, ఈ సారి హార్రర్ తోనే చేసిన కొత్త ప్రయోగం ఇవాళ దేశవ్యాప్త చర్చ అయింది. దీని ప్రత్యేకత లేమిటో కథలోకి వెళ్ళి చూద్దాం...