అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు: వరుణ్ తేజ్
వరుణ్‌తేజ్ సినిమాల్లో మాంచి యాక్షన్, ప్రయోగం, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అంటే ‘గద్దలకొండ గణేశ్’ అని చెప్పాలి. హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ఇది. అలాగే వరుణ్‌తేజ్ పక్కన పక్కాగా సూట్ అయిన హీరోయిన్ల సాయిపల్లవి ఒకరు అని చెప్పొచ్చు. దీంతో ఈ రెండు రకాల కాంబినేషన్లు మళ్లీ రావాలి అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఉంటే… మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ల గురించి వరుణ్ తేజ్ మాట్లాడాడు.

